100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ వచ్చిన బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఆ మాట మీద నిలబడలేకపోతోంది. అందులో సగమైనా వినోదాన్ని పంచేందుకు నానాతంటాలు పడుతోంది. పైగా బలమైన కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ ఉండటంతో షోపై జనాలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. పస లేని పాత టాస్కులతో ప్రేక్షకుల సహనం నీరుగారిపోతోంది. వెరసి బిగ్‌బాస్ టీఆర్పీ రేటింగ్స్ సీరియల్స్‌ను కూడా దాటలేకపోతున్నాయి. వీకెండ్‌లో మాత్రం పర్వాలేదనింపించే టీఆర్పీలను దక్కించుకుంటున్నాయి. అయితే దసరా నాడు సమంత విజయవంతంగా నడిపించిన మారథాన్ ఎపిసోడ్‌కు 11.3 టీఆర్పీ రేటింగ్ దక్కడం విశేషం. ఆమె హోస్టింగ్ బాగోలేదని పెదవి విరిచిన వాళ్లకు ఈ రేటింగే చెంపపెట్టు సమాధానమిస్తోంది. (చదవండి: మోనాల్‌కు 30, అఖిల్‌కు 25.. పెళ్లి చేయలేం)
కాగా ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌కు 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అంటే దాదాపు 4.5 కోట్ల మంది వీక్షించారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. రోజులు గడిచేకొద్దీ టీఆర్పీ పెరగాల్సింది పోయి ప్రతివారం తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బిగ్‌బాస్ షో ప్రారంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఏదేమైనా రేటింగ్స్ దారుణంగా క్షీణిస్తున్న తరుణంలో సమంత అడుగుపెట్టి షోకు కొత్త వన్నె తెచ్చారు. తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించారన్న మాటే కానీ ఎక్కడా తడబడలేదు. అందరినీ కలుపుకుపోతూ, ముద్దుముద్దుగా తెలుగు మాట్లాడుతూ ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేశారు. ప్రతివారం పదిలోపే సాగిలబడి కొట్టుకుంటున్న రేటింగ్‌ను 11.3కు తీసుకువచ్చారు. మామ నాగార్జున తనకు అప్పజెప్పిన పనిని శిరోధార్యంగా భావించి సమర్థవంతంగా పూర్తి చేసి ప్రశంసలు దక్కించుకున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే 'జాను' తర్వాత ఆమె మరే సినిమా ఒప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆమె నటించి, డబ్బింగ్ చెప్పిన "ఫ్యామిలీ మ్యాన్ 2" వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. (చదవండి: బిగ్‌బాస్: టీఆర్పీలో సరికొత్త రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment