బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ఎంత గ్రాండ్‌గా ప్రారంభమైందో ప్రేక్షకులు కూడా అంతే గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. అసలే ఎంటర్‌టైన్‌మెంట్ కరువు కాలంలో ఉన్న వీక్షకులకు బిగ్‌బాస్ ఎడారిలో ఓయాసిస్సుగా కనిపించింది. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ రోజు కంటెస్టెంట్లు ఎవరా అని టీవీలకు అతుక్కుపోయారు. అందరూ ఇంట్లో ఎంటరయ్యాక వీళ్లందరూ ఎవరా అని తల గోక్కున్నారు. ఇది వేరే విషయం. అయితే షో ప్రారంభ ఎపిసోడ్‌కు ఎన్నడూ రానంత టీఆర్పీ వచ్చిందని స్టార్ మా సగర్వంగా ప్రకటించింది. తొలి వారంలో షోను 4.5 కోట్ల మంది వీక్షించారని, 18.5 టీఆర్పీ నమోదు చేసిందని తెలిపింది. (గత సీజన్లను వెనక్కునెట్టిన బిగ్‌బాస్ )
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ షోను చూశారని స్వయంగా నాగార్జునే వెల్లడించారు. అంతే కాకుండా దేశంలోనే ఏ బిగ్‌బాస్ షోకు రాని ప్రజాదరణ ఈ సీజన్‌కు వచ్చిందని తెలిపారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియకు కూడా ఎన్నడూ లేనంతగా 6 కోట్ల ఓట్లు వచ్చాయని వెల్లడించారు. దీంతో లోపల ఉన్న కంటెస్టెంట్లు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. కానీ బిగ్‌బాస్ స్పీడుకు ఐపీఎల్ అడ్డుకట్ట వేసింది. ఆకాశాన్నంటిన టీఆర్పీలు ఇప్పుడు నేలపైకి దిగి వచ్చాయి. బిగ్‌బాస్ షోకు రెండో వారాంతం రేటింగ్ 10.7గా ఉంది. వారం మొత్తానికి కేవలం 8.05 రేటింగ్ వచ్చింది. (బిగ్‌బాస్ హౌస్‌లో తలనొప్పిగా మారుతోన్న గంగవ్వ!)
Comments
Please login to add a commentAdd a comment