బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023) తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టితో లీగ్ దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. ఆర్‌సీబీ, ముంబైలు తలపడనుండగా.. మరో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ ఆఖరి మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ ప్లేఆఫ్‌కు క్వాలిఫై కాగా.. ఆర్‌సీబీ వుమెన్, గుజరాత్ జెయింట్స్ లీగ్ దశలోనే నిష్క్రమించాయి.
మరి మెన్స్ ఐపీఎల్‌లాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ విజయవంతమైందా అనేది ఆసక్తికరంగా మారింది. పురుషుల ఐపీఎల్‌తో పోలిస్తే డబ్ల్యూపీఎల్‌కు అంతగా ఆదరణ లేకపోయినప్పటికి తొలివారం ముగిసేసరికి ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. అన్ని వర్గాలు(రూరల్, అర్బన్) కలిపి 50.78 మిలియన్ మంది వీక్షించినట్లు బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్జీ కౌన్సిల్(BARC- బార్క్) తెలిసింది.ఇందులో 15+ ఏజ్ గ్రూప్‌లో 40.35 మిలియన్ మంది ఉన్నట్లు పేర్కొంది.
కాగా ఆర్‌సీబీ వుమెన్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ను అత్యధికంగా వీక్షించారు. ఈ మ్యాచ్‌కు 0.41 రేటింగ్ నమోదైనట్లు తేలింది. గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ 0.40 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత అత్యధికంగా వీక్షించిన వాటిలో వరుసగా ముంబై ఇండియన్స్ వుమెన్, గుజరాత్ జెయింట్స్ మ్యాచ్(0.26), ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్‌సీబీ వుమెన్(0.24), ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్(0.34), ఆర్‌సీబీ వర్సెస్ యూపీ వారియర్జ్(0.33) టీఆర్పీ రేటింగ్స్ సాధించాయి. మరో విశేషమేమిటంటే ముంబై ఇండియన్స్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు మంచి టీఆర్పీ రేటింగ్ లభించింది.
ఈ వారంతో ముగియనున్న డబ్ల్యూపీఎల్ వంద మిలియన్ వ్యూస్ సాధించడం కష్టమే అనిపిస్తుంది. ఓవరాల్‌గా 70 నుంచి 80 మిలియన్ల వ్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు బార్క్ తెలిపింది. ఈ లెక్కన తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతమైనట్లే. ఎందుకంటే పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు కాస్త ఆదరణ తక్కువే. అయినా కూడా తొలి సీజన్‌లో 80 మిలియన్ వ్యూస్ సంపాదించిందంటే ఒక లెక్కన సీజన్ విజయవంతమైనట్లే.
చదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. హిందీ సీరియల్‌లో నటిస్తున్న శిఖర్ ధావన్!
Comments
Please login to add a commentAdd a comment