
మనోహరం, బీస్ట్ వంటి చిత్రాలతో మలయాళ, తమిళ ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అపర్ణ దాస్. తాజాగా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రంలో (PVT04- వర్కింగ్ టైటిల్) కీలక పాత్రలో నటిస్తోంది అపర్ణా దాస్. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, ఎస్.సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వజ్ర కాళేశ్వరీ దేవి పాత్రను పోషిస్తోంది అపర్ణా దాస్. ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆమె రాక సినిమాకు మరింత ఆకర్షణ అవుతుందని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment