మరో మాస్ పాట.. శ్రీలీల కేక పుట్టించే డ్యాన్స్! | Vaishnav Tej And Sreeleela Aadikeshava Movie Leelammo Lyric Video Song Released, Watch Video Inside - Sakshi
Sakshi News home page

Leelammo Lyrical Video Song: మరో మాస్ పాట.. కేక పుట్టించిన శ్రీలీల!

Published Wed, Oct 25 2023 7:21 PM | Last Updated on Wed, Oct 25 2023 8:29 PM

Aadikeshava Movie Leelammo Lyric Video Sreeleela - Sakshi

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా 'ఆదికేశవ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి 'లీలమ్మో' అనే పాట లిరికల్ వీడియోని బుధవారం రిలీజ్ చేశాడు. ఫుల్ మాసీగా ఉన్న ఈ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. హైదరాబాద్‌లో ఓ హోటల్‪‌లో సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ పాట గురించి మాట్లాడిన శ్రీలీల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

(ఇదీ చదవండి: అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!)

'లీలమ్మో' నాకు ఎంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట. అందుకే ఇది నాకు చాలా స్పెషల్. ఈ సాంగ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది పర్ఫెక్ట్ మాస్ సాంగ్. పాట వినగానే నాకు స్నేక్ డ్యాన్స్ చేయాలి అనిపించింది' అని శ్రీలీల చెప్పుకొచ్చింది.

ఇకపోతే 'ఆదికేశవ' సినిమాతో శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ ప‌తాకాల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 

(ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement