నవంబరులో ఆదికేశవ  | Adikesava movie is releasing on November 10 | Sakshi
Sakshi News home page

నవంబరులో ఆదికేశవ 

Published Sat, Aug 19 2023 12:28 AM | Last Updated on Sat, Aug 19 2023 1:14 AM

Adikesava movie is releasing on November 10 - Sakshi

వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఫిల్మ్‌ ‘ఆదికేశవ’. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఫ్యారిస్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్‌ షెడ్యూల్‌తో ‘ఆదికేశవ’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

కాగా ఈ సినిమాను తొలుత ఈ నెల 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో ‘ఆదికేశవ’ చిత్రాన్ని నవంబరు 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ శుక్రవారం వెల్లడించింది. జోజూ జార్జ్, అపర్ణా దాస్‌ కీలక పాత్రలు పొషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement