Srikant
-
‘కోట బొమ్మాళి పీఎస్’లో హీరోలు లేరు: అల్లు అరవింద్
‘పోలీసులనే పోలీసులు వెంటాడే విచిత్రమైన కథ ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమాలో హీరోలు లేరు.. కథే హీరోగా వెళుతుంటుంది. ఈ చిత్రం ఏ రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి తీయలేదు. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘లింగిడి లింగిడి..’ పాట తర్వాత ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ చిత్రం మంచి హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను. ఇప్పుడున్న పరిస్థితులకి చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్‌గా చెప్పారు’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ‘‘ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు. -
నవంబరులో ఆదికేశవ
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఫ్యారిస్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్ షెడ్యూల్‌తో ‘ఆదికేశవ’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ సినిమాను తొలుత ఈ నెల 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో ‘ఆదికేశవ’ చిత్రాన్ని నవంబరు 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది. జోజూ జార్జ్, అపర్ణా దాస్ కీలక పాత్రలు పొషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్. -
బెయిల్‌పై విడుదల: రాజకీయ నాయకుడికి అట్టహాసంగా ఘనస్వాగతం
నోయిడా: రాజకీయ నేత శ్రీకాంత్ త్యాగి మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి జైలు పాలైన సంగతి తెలిసిందే. ఐతే ఆ నాయకుడు ప్రస్తుతం బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో అతని అనుచర వర్గాలు అతనికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. పైగా శ్రీకాంత్ బాయ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సదరు రాజకీయ నాయకుడు త్యాగి తన ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ...తనపై చేసిన గ్యాంగ్‌స్టర్ వంటి ఆరోపణలు కల్పితమన్నారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ క్రుట్రలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వివాదంలోకి తన సోదరిని కూడా లాగి తమ మధ్య గొడవలు సృష్టించాలని చూశారన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచిని తమ కమ్యూనిటీ వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, తాను చేయాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చాడు. తన తదుపరి నిర్ణయాల విషయమై మాట్లాడుతూ...తన మద్దతుదారులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. త్యాగికి అలహాబాద్ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేయడంతో అతను గురువారం జైలు నుంచి విడుదలయ్యాడు. వాస్తవానికి త్యాగి గ్రాండ్ ఓమాక్స్ సొసైటీలో ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ కావడంతో అతన్ని అరెస్టు చేశారు. అతనిపై దోపిడీ నేరం, గ్యాంగ్‌స్టర్, మహిళలపై దాడి చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఐతే త్యాగి మాత్రం బీజేపీ రైతు విభాగం సభ్యుడినని చెబుతూ... పార్టీ అధినేత జేపీ నడ్డాతో దిగిన ఫోటోలను చూపిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం సీరియస్‌గా ఆ వ్యాఖ్యలను ఖండించడం గమనార్హం. (చదవండి: మూడేళ్లుగా మారువేషంలో.. బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?) -
రీల్లోనే కాదు రియల్‌గాను హిట్ పెయిరే
(వెబ్‌స్పెషల్): రోజులు మారాయి.. ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయిలు కూడా జాబ్ చేసే అమ్మాయిలనే కోరుకుంటున్నారు. పెళ్లి విషయానికి వస్తే.. ఇద్దరు ఉద్యోగం చేస్తూంటే.. అమ్మాయిది, అబ్బాయిది ఒకే ఫీల్డ్ అయితే మరీ మంచిది అంటున్నారు. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ రంగంలోని వారిని వివాహం చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ సినీ ఫీల్డులో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా బయటి వ్యక్తులను వివాహం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అలా ఇండస్ట్రీలోని వారినే వివాహం చేసుకుని.. రీల్లోనే కాదు రియల్‌గా కూడా హిట్ పెయిర్ అనిపించుకుంటున్న వారిని ఓ సారి చూడండి.. కృష్ణ-విజయ నిర్మల 1961లో కృష్ణకు ఆయన మరదలు ఇందిరతో వివాహం అయ్యింది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో మొదటిసారి కృష్ణ,విజయ నిర్మల కలిసి నటించారు. ఆ సినిమా సాక్షిగా వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం అయినప్పటికి అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్-ఊహ ‘ఆమె’ సినిమా షూటింగ్ టైంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం మొదలయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. అలా మెల్లిగా శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్ - ఊహ వివాహం 1997లో జరిగింది. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: మొత్తం స్టూడియోలోనే?) జీవిత-రాజశేఖర్ జంట పదాలుగా తెలుగు పరిశ్రమలో ఈ భార్యాభర్తల పేర్లు ఎప్పటికీ పాపులరే. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమె వద్దు తొలగించండి’ అంటూ దర్శక నిర్మాతలకు చెప్పారు. ఆయన ఇలా చెప్పడంతో దర్శకనిర్మాతలు.. రాజశేఖర్‌నే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ సినిమాలో కలిసి నటించవలసి వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది కాస్తా ప్రేమగా మారింది. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగులో రాజశేఖర్ గాయపడినప్పుడు, జీవిత ఆయన దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగార్జున- అమల టాలీవుడ్ సెలబ్రిటీలలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో అక్కినేని నాగార్జున-అమల జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్‌గా వెలుగొందుతున్న సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట సిల్వర్ స్క్రీన్ పై 'ప్రేమయుద్ధం' 'కిరాయి దాదా' 'శివ' 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేష్ సోదరితో వివాహం జరగడం.. విడాకులు తీసుకోవడం జరిగింది. (చదవండి: నో ప్యాంట్ 2020.. జీన్స్‌కి గుడ్‌బై) మహేష్‌బాబు-నమ్రత అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే ఎనలేని ప్రేమ. తన సక్సెస్‌కు కారణం నమ్రత అని చెప్తారు. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు లవ్ చేసుకున్న వీరు 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి దగ్గరి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అతి నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చై-సామ్ ప్రస్తుతం ఉన్న దంపతుల్లో చై-సామ్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఏ మాయ చేశావే చిత్రంలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఆటో నగర్ సూర్య, మనం, వంటి చిత్రాల్లో కలిసి నటించారు. 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత మజిలీ చిత్రంలో జంటగా నటించారు. (చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...) షాలిని- అజిత్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్గా నటించారు. 2000 సంవత్సరంలో నటుడు అజిత్‌ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. సూర్య- జ్యోతిక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. వ్యక్తిగతంగానే కాక ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఉంది. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్ సందేశ్-వితిక, రాధిక-శరత్ కుమార్, ఆర్య-సయేషా సైగల్ ఉండగా ఇక బాలీవుడ్లో బిగ్ బీ- జయా బచ్చన్, అభిషేక్- ఐశ్వర్య, కరీనా-సైఫ్, దీపికా- రణ్వీర్ దంపతులు ప్రేమించి వివాహం చేసుకుని.. ఆనందంగా, ఆదర్శంగా జీవిస్తున్నారు. -
భట్టి సన్మాన సభలో రభస
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన రెండు వర్గాల నేతలు ఘర్షణకు దిగడంతో గందరగోళం నెలకొంది. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఓబీసీ సెల్ నగర అధ్యక్షుడు శ్రీకాంత్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ చివరికి శ్రీకాంత్ సస్పెన్షన్‌కు దారితీసింది.శనివారం గాంధీభవన్‌లో ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిత్తరంజన్‌దాస్ ఆధ్వర్యంలో కొత్తగా ప్రతిపక్ష నేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కకు సన్మానం ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ఎంపీ వీహెచ్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. సన్మాన సభ మొదలైన కొద్ది సేపటికే వేదికపై ఉన్న వీహెచ్‌కు వ్యతిరేకంగా నగర ఓబీసీ సెల్ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ వర్గీయులు ఆందోళనకు దిగారు. అంబర్‌పేట టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో సహనం కోల్పోయిన వీహెచ్ వారిని దుర్భాషలాడారు. ఈ సమయంలో వీహెచ్ వర్గీయులు కొందరు నూతి శ్రీకాంత్ వర్గీయులపైకి దూసుకురావడంతో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాలు కుర్చీలతో, పిడిగుద్దులతో పరస్పరం దాడిచేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల వారిని సీనియర్ నేతలు శాంతింపజేసే ప్రయత్నం చేశారు.అయినా గొడవ సద్దుమణగక పోవడంతో హడావుడిగా కార్యక్రమాన్ని ముగించారు. నగర సెల్ పదవి నుంచి శ్రీకాంత్ తొలగింపు.. ఘర్షణకు కారణమైన శ్రీకాంత్‌ను నగర ఓబీసీ సెల్ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ సెల్ అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తనను సస్పెండ్ చేయడంపై నూతి శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. తనకు మద్దతుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కార్యకర్తలను వీహెచ్ దుర్భాషలాడినం దునే తాను ప్రతిఘటించానని తెలిపారు. మంద బలంతో గెలుద్దామంటే పప్పులుడకవ్: భట్టి తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, లక్షలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల గొంతుక వినిపించాలని ప్రజలు తమను అసెంబ్లీకి పంపారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తానని వాగ్దానం చేశారు. గెలుపోటములు రాజకీయాల్లో శాశ్వతం కాదని, కేసీఆర్ కంటే బలమైన నేతలు వచ్చారని, అనంతరం కాల గర్భంలో కలిశారన్నారు. కాంగ్రెస్ ఓడిపోయిందని, మంద బలంతో నియంత్రిద్దామనుకుంటే పప్పులుడకవని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలున్నా తనకు లేఖ రాయాలని కోరారు. కార్యక్రమం ముగిసిన అనంతరం నూతి శ్రీకాంత్, ఆయన వర్గీయులు భట్టి చాంబర్ వద్ద ధర్నాకు దిగారు. తనపై దుర్భాషలాడిన వీహెచ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత వీహెచ్‌పై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. -
ఆ క్రెడిట్ అంతా దర్శకుడు కృష్ణవంశీదే!
హైదరాబాద్: గోవిందుడు అందరివాడేలే చిత్రం ఆ విధంగా రూపొందించిన క్రెడిట్ అంతా దర్శకుడు కృష్ణవంశీదేనని ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. ఈ రోజు ఉదయం సాక్షి టీవీ చిట్‌చాట్‌లో బండ్ల గణేష్‌తోపాటు హీరో శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ - కాజల్ మూడవసారి జంటగా నటించారు. హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈ మూవీ నిర్మాణంలో ముగ్గురి పాత్ర కీలకంగా ఉన్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. ఆ ముగ్గురు రామ్ చరణ్ - కృష్ణవంశీ - పరుచూరి వెంకటేశ్వర రావు అని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి సినిమా రావలసిన అవసరం ఉందని కృష్ణ వంశీ చెప్పినట్లు తెలిపారు.ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.తెలుగు చిత్రం పరిశ్రమకు ఆయన ఓ వరం అన్నారు. ఫ్యామిలీ డ్రామా, కుటుంబ బంధాలు - అనుబంధాలతోపాటు పల్లెటూరి నేపధ్యంలో చిత్రం నిర్మించడంలో కృష్ణవంశీ దిట్ట అన్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. సినిమా పూర్తి అయ్యేవరకు ఇక్కడే ఉండి సహకరించినట్లు తెలిపారు. మెగా ఫ్యామిలీ చిరంజీవి-పవన్ కల్యాణ్- రామ్ చరణ్‌లతో చిత్రం నిర్మించే ఆలోచన ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు ఆ రకమైన ఆలోచన మరీ ఎక్కువ ఆశైపోతుందని గణేష్ అన్నారు. చిరంజీవి 150వ సినిమా నిర్మిస్తారా? అగి అడగగా, అటువంటి అవకాశం లేదని చెప్పారు. అయితే ప్రయత్నిస్తానని అన్నారు. గ్రామీణ వాతావరణంలో, కుటుంబ నేపథ్యంలో ఇటువంటి చిత్రాలు రూపొందించడంలో కృష్ణవంశీది అందెవేసి చేయని శ్రీకాంత్ అన్నారు. ఆయన కూడా పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చినట్లు తెలిపారు. **