
మెగా మేనల్లుడు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వలో వైష్ణవ్-కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ఉప్పెన మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవ్ నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీర ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. ఈ మూవీకి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు.
చదవండి: ‘ఖిలాడి’ మూవీ రివ్యూ
ఇందులో వైష్ణవ్ సరసన ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా రంగ రంగ వైభవంగా మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
చదవండి: Jagapathi Babu: 60వ పుట్టిన రోజు సందర్భంగా జగపతి బాబు కీలక నిర్ణయం
Get Ready to meet Rishi & Radha❤️ in Theaters near you!#RangaRangaVaibhavanga in theaters from May 27th!
— Panja Vaisshnav Tej (@VaisshnavTej) February 11, 2022
A Rockstar @ThisIsDSP Musical 🎹
Directed by @GIREESAAYA
#RRVonMay27#PanjaVaisshnavTej #Ketikasharma #RRVTheFilm @SVCCofficial @BvsnP pic.twitter.com/Ez2BlRJKLS
Comments
Please login to add a commentAdd a comment