మెగా మేనల్లుడు, యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నేటితో 32వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. నేడు(జనవరి 13) వైష్ణవ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అతడికి మెగా ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక వైష్ణవ్ బర్త్‌డే సందర్భంగా అతడి కొత్త ప్రాజెక్ట్స్‌ను ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇక ఫ్యాన్స్‌తో పాటు వైష్ణవ్‌కు సినీ సెలబ్రెటీలు కూడా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగా డాటర్ నిహారిక వైష్ణవ్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సందర్భంగా ఆమె ఓ క్యూట్ వీడియోను షేర్ చేస్తూ ఈ మెగా మేనల్లుడికి విషెస్ చెప్పింది. ఈ వీడియోలో నిహారిక, వైష్ణవ్‌లు చిన్న పిల్లల్లా కొట్టకుంటూ కనిపించారు. పిల్లలు ఆడుకునే ప్లెయింగ్ నెట్‌లో కూర్చుని బాల్స్‌తో వీరిద్దరూ కొట్టుకుంటున్న వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి ‘ఈ వీడియో మన ఇద్దరి మధ్య బాండింగ్‌ను నిర్వచిస్తుంది(ఎప్పుడూ గొడవ పడుతూ, పక్కవారికి ఇబ్బంది లేకుండా సైలెంట్ జోక్స్‌తో మా వెర్రిలో మేముంటాం). మాటల కంటే చర్యలు పెద్దవి అనడానికి ఇది ఉదాహరణ.
నేను ఇంతవరకు చూడని స్వచ్చమైన మనసు, వ్యక్తిత్వం నీది. ఇతరులకు అవసరం ఉన్నప్పడు సాయం చేసే మొదటి వ్యక్తివి నీవే. ధైర్యంతో, కష్టపడి పని చేసే వ్యక్తిత్వమే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది వైషు. అందుకే నేనెప్పుడూ నీకు పెద్ద అభిమానిని. హ్యాపీ బర్త్‌డే వైషుగా. మై రాక్‌స్టార్’ అంటూ రెడ్ హర్ట్ ఎమోజీని జత చేసి షేర్ చేసింది నిహారిక. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీరిద్దరి బాండింగ్ చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. అంతేగాక ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ వైష్ణవ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment