యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందిజ. ఇందులో ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసున్న మాజీ ఆటగాడిగా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. అయితే బుచ్చిబాబు, ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ఎప్పటి నుంచి టాక్ నడుస్తుండగా.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో మూవీ ఉందా? లేదా? అనే సందేహం కూడా మొదలైంది.
చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా..
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీకి టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర పేరు ‘పెద్ది’ అట. అదే పేరును సినిమా టైటిల్‌గా పెట్టే ఆలోచనలో దర్శక-నిర్మాతలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చలు జరిపి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా కబడ్డీ ఆటగాడిగా ఒక ఆశయం దిశగా హీరో ముందుకు వెళతాడు.
చదవండి: పెళ్లెందుకు అంత సీక్రెట్‌గా చేసుకున్నావు: మహేశ్‌ను ఆరా తీసిన బాలయ్య
ఆ ఆశయం చుట్టూ ఆవేశం, బలమైన ఎమోషన్స్ ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ఈ మూవీ కంటే ముందు ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ కనిపిస్తాడని చెబుతున్నారు. ఇందులో హీరోయిన్లుగా రష్మిక మందన్నా, కీర్తి సురేశ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment