న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. బుచ్చిబాబు మద్యం విధానం కుట్రలో భాగస్వామి అని సీబీఐ కోర్టుకు తెలిపింది. సహ నిందితులతో కలిసి అనేక సమావేశాలకు హాజరయ్యారని, చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని తెలిపింది.
అనంతరం బుచ్చిబాబుకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేయగా మూడు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతించింది కోర్టు. నేడు సీబీఐ కస్టడీ ముగియడంతో ఈనెల 25 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.
Comments
Please login to add a commentAdd a comment