ఇటీవల ఒక్కటైన టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంతలు త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌కు ప్లాన్ చేస్తోంది. పెళ్లి వేడుకను అత్యంత సన్నిహితుల సమక్షంలో జరుపుకున్న ఈ జంట స్నేహితులు ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. ఇప్పటికే చెన్నైలో నాగచైతన్య తల్లి లక్ష్మీ అక్కడి స్నేహితుల కోసం ఓ రిసెప్షన్‌ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా హజరయ్యారు.
ఇప్పుడు హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్‌కు అక్కినేని కుటుంబం గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 12న ఈ వేడుకను నిర్వహించనున్నారట. ప్రస్తుతం షూటింగ్ ల నుంచి విరామం తీసుకున్న ఈ జంట రిసెప్షన్ తరువాత తిరిగి షూటింగ్‌లకు హజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ రిసెప్షన్‌కు కేవలం ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారా.. లేక అభిమానుల కూడా పిలుస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment