
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రేమ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ జంట ఆదివారం హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్ తారలతో పాటు, క్రీడా రంగ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన నాగార్జున, అమల, చాముండేశ్వరీనాథ్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌లు నూతన జంటకు ఆశీస్సులు అందజేశారు. కాగా, నిరాడంబరంగా సాగిన సైనా, కశ్యప్‌ల వివాహ వేడుకకు ఇరువైపుల నుంచి అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment