
సాక్షి, హైదరాబాద్ : పదేళ్లుగా ప్రేమించుకుంటున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు శుక్రవారం సాయంత్రం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ రాయదుర్గంలోని సైనా నివాసం ‘ఒరియన్ విల్లా’లో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య ఈ ‘రాకెట్ స్టార్స్’ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం ‘నా జీవితంలో ఇదే గొప్ప మ్యాచ్’ అంటూ సైనా ట్వీట్ చేశారు. పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 16న హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్‌లో రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, దగ్గుబాటి సురేష్‌లతో పాటు ‘అగిలే గ్రూప్ హైదరాబాద్ హంటర్స్’ చీఫ్ ఎండీవీఆర్‌కే రావు, మంత్రి కేటీఆర్, చాముండేశ్వరీనాథ్, రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్ ఆహ్వాన పత్రికలను అందజేశారు. (మిక్స్‌డ్ డబుల్స్)
Best match of my life ❤️...#justmarried ☺️ pic.twitter.com/cCNJwqcjI5
— Saina Nehwal (@NSaina) 14 December 2018