
దీప్‌వీర్ జంట
సాక్షి బెంగళూరు: అంగరంగ వైభవంగా దీపికా పదుకొణే–రణ్‌వీర్ సింగ్ రిసెప్షన్ బెంగళూరులో జరిగింది. నగరంలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు కర్ణాటకకు చెందిన అతిరథమహారథులు పాల్గొన్నారు. రాయల్ లుక్‌లో నూతన వధూవరులు అందరినీ అలరించారు. కన్నడలో ‘నమస్కార’ అంటూ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దీపిక–రణ్‌వీర్ రిసెప్షన్ విష యం తెలుసుకున్న వారి అభిమానులు వందలాది సంఖ్యలో హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రముఖులకు మాత్రమే రిసెప్షన్‌కు ఆహ్వానం కావడంతో చాలా మంది అభిమానులు హోటల్ గేట్ బయటే నిరాశగా నిలుచున్నారు.
తన తల్లి ఉజ్జాల పదుకొణే ఇచ్చిన బంగారు వర్ణపు కాంచీవరం పట్టుచీర కట్టుకుని దీపికా మెరిశారు. అలాగే రణ్‌వీర్ రాయల్ లుక్‌లో ఖరీదైన కుర్తా అందుకు తగ్గ బూట్లను ధరించి ఆకట్టుకున్నారు. దీపికా తల్లిదండ్రులు ప్రకాశ్ పదుకొణే–ఉజ్జాల కూడా రిసెప్షన్‌లో బంగారు వర్ణపు పట్టు బట్టలు ధరించారు. ఈ రిసెప్షన్‌లో దీపికా సోదరీలు అనిశా, రీతికా, రణ్‌వీర్ తండ్రి జగీత్ సింగ్ భవానీ, తల్లి అంజు భవాని తదితరులు పాల్గొన్నారు.
మీడియా ఫోటోలకు ఫోజులిస్తున్న సందర్భంలో దీపికా చీరను రణ్‌వీర్ సరిచేయడం అందరినీ ఆకట్టుకుంది. భార్య చీరను సరిచేస్తూ సహకరించిన రణ్‌వీర్‌కు సోషల్‌మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది. భార్యకు తగ్గ భర్త అంటూ అభిమానులు రణ్‌వీర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దీపికా రిసెప్షన్ బాధ్యతలను ముంబైకి చెందిన సంస్థకు అప్పగించారు. వారికి కన్నడ తెలియకపోవడంతో కమ్యూనికేషన్‌కు ఇబ్బందిగా మారింది. ముంబై, ఢిల్లీ నుంచి వచ్చిన మీడియాకు ఎలాంటి ఇబ్బందులు కలగకపోయినా.. స్థానిక మీడియాకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం విశేషం. కొన్ని కన్నడ సంఘాలకు చెందిన కార్యకర్తలు తమ ఐడెంటినీ కార్డును చూపించినా లోపలికి అనుమతించకపోవడం విశేషం. దీంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు.
ప్రముఖుల హాజరు..
వేడుకగా జరిగిన ఈ రిసెప్షన్‌కు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సుధామూర్తి, బయోకాన్ ముఖ్యులు కిరణ్ మజుందార్ షా, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ దంపతులు, ప్రముఖ బ్యా డ్మింటన్ క్రీడాకారిణులు పీవీ సింధూ, సైనా నె హ్వాల్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకణి తదితరులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. లీలాప్యాలెస్‌లోని బాల్ రూమ్‌ను రిసెప్షన్ కోసం బుక్ చేశారు. దీపికాకు ఇ ష్టమైన ఇటాలియన్ వంటకాలతో పాటు దక్షిణ, ఉ త్తరాది భారతప్రముఖ వంటకాలన్నింటినీ సిద్ధం చేశారు. రిసెప్షన్ కోసం సిద్ధం చేసిన వేదిక మొత్తం గులాబీలతో నిండి పోయింది. బంగారు వర్ణంతో కుర్చీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఆహ్వానం పలికేవారు కూడా తెలుపు దుస్తులతో ఒక డ్రెస్ కోడ్‌ను పాటించారు.