సమంత, రిసెప్షన్ ఎక్కడో చెప్పేసింది..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో నాగచైతన్యతో పెళ్లికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసిన ఈ జంట.. పెళ్లి ఎప్పుడు, ఎక్కడా అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సమంత, చైతన్యలు ఏ ఫంక్షన్లో కనిపించినా ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలో సమాధానం చెప్పడానికి కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు మాత్రం అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు ఈ స్టార్ కపుల్.
తాజాగా టీ గ్రిల్స్ రెస్టారెంట్ ఓపెనింగ్కు వెళ్లిన సమంతకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. నాగచైతన్యతో మీ వివాహం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా.. మా రిసెప్షన్ మాత్రం ఈ రెస్టారెంట్ లోనే ఏర్పాటు చేస్తామని సమాధానమిచ్చింది సామ్. సమంతా లాంచ్ చేసిన రెస్టారెంట్ ఆమె కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్రెండ్ అయిన నీరాజ కోన, హీరో నితిన్ ను కలిసి చేస్తున్న బిజినెస్.ఈ ఇద్దరు సన్నిహితులే కావటంతో రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ బ్యూటి సందడి చేసింది.