తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు శుక్రవారం సాయంత్రం తిరుపతిలో భేటీ కానున్నారు. మధ్యాహ్నం వైఎస్ జగన్... మూడు గంటలకు స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నేతలతో ఆయన సమావేశమవుతారు. తిరుపతిలో పీఎల్‌ఆర్ కన్వెన్షన్‌హాల్‌లో ఎన్ఆర్ఐ చెన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. వివాహ రిసెఫ్షన్ అనంతరం ఆయన పులివెందుల బయల్దేరి వెళతారు.
వైఎస్ జగన్తో భేటీ కానున్న పార్టీ నేతలు
Published Fri, Dec 12 2014 9:43 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement