హాస్యం అపహాస్యం కాకూడదనేదే నా లక్ష్యం: కమెడియన్‌ అలీ | Telugu Vignana Samithi Bangalore Felicitated Ali | Sakshi
Sakshi News home page

Comedian Ali: ప్రజలను నవ్వించడమే నా తపన.. అలీ

Apr 10 2022 7:26 PM | Updated on Apr 10 2022 7:37 PM

Telugu Vignana Samithi Bangalore Felicitated Ali - Sakshi

తన మంచితనమే సినీరంగంలో ఇంతటి పేరును తెచ్చిందని చెప్పారు. స్థానిక తెలుగు పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని సమితి అధ్యక్షుడు ఎ.రాధాకృష్ణరాజు కర్ణాటక సర్కారుకు విజ్ఞప్తి చేశారు. సరదాకు మరోపేరు అలీ..

హాస్యం అనేది అపహాస్యం కారాదని ప్రముఖ తెలుగు నటుడు అలీ అన్నారు. శుక్రవారం రాత్రి బెంగళూరులోని తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో 70వ ఉగాది ఉత్సవాలు - శ్రీకృష్ణదేవరాయల పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అలీతో పాటు కన్నడ రంగస్థల నటుడు సరిగమ విజీ, విద్యాసంస్థల అధినేత వేణుగోపాల్‌, ప్రిన్స్‌ రామవర్మ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా అలీ ప్రసంగిస్తూ ప్రజలను నవ్వించడమే నా తపన అన్నారు. అయితే హాస్యం అపహాస్యం కాకూడదనేది తన లక్ష్యమన్నారు.

తన మంచితనమే సినీరంగంలో ఇంతటి పేరును తెచ్చిందని చెప్పారు. స్థానిక తెలుగు పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని సమితి అధ్యక్షుడు ఎ.రాధాకృష్ణరాజు కర్ణాటక సర్కారుకు విజ్ఞప్తి చేశారు. సరదాకు మరోపేరు అలీ అని సమితి ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మిరెడ్డి అన్నారు. వెండితెర తారాజువ్వ అలీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.

చదవండి: కమెడియన్‌ అలీతో హీరోయిన్‌ పెళ్లి, పత్రికల్లో ఫొటో!

ఆమెతో లవ్‌ ట్రాక్‌, కానీ ఆ కమెడియన్‌కు ఆల్‌రెడీ పెళ్లైంది.. ఫొటోతో బయటపెట్టిన కంగనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement