
ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి చిరంజీవి, నాగార్జున సతీసమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. నటి రోజా సైతం పెళ్లివేడుకలో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా తన కూతురి పెళ్లికి రావాలంటూ అలీ భార్య జుబేదాను వెంటపెట్టుకుని ఇండస్ట్రీ మిత్రుల ఇంటికి వెళ్లి స్వయంగా శుభలేఖలు అందించిన విషయం తెలిసిందే! అటు జుబేదా నగల షాపింగ్ నుంచి హల్దీ ఫంక్షన్ వరకు అన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు పెళ్లిపనులను అభిమానులకు అప్‌డేట్ ఇస్తూ వచ్చింది.
B O S S #MegastarChiranjeevi garu today @#Ali Daughters Marriage 🤩#ValtheruVerayya #BossParty@KChiruTweets @Chiru2020_ @Deepu0124 @Chirufan4ever @ChiruIdealActor @Chiru_FC @ChiruFanClub @Chiru025527081 @EluruMegaFan @GaddamMega @Konidelachiru31 pic.twitter.com/KADKQeGnEQ
— Ramesh BOLLI (@RameshBOLLIS) November 27, 2022
Comments
Please login to add a commentAdd a comment