
కమెడియన్ అలీ ఇంట పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. అలీ కూతురు ఫాతిమా త్వరలో ఓ ఇంటి కోడలు కాబోతున్న విషయం తెలిసిందే కదా! అందులో భాగంగా ఇప్పటికే పసుపు దంచే కార్యక్రమం ఫంక్షన్, బ్రైడల్ షవర్ పూర్తవగా తాజాగా పెళ్లి పత్రికలు పంచే పనిలో పడ్డారు అలీ దంపతులు. పనిలో పనిగా వీలు దొరికితే షాపింగ్ కూడా చేస్తోంది అలీ భార్య జుబేదా.
తాజాగా వైజాగ్‌లో అలీని వెంటపెట్టుకుని నగలు కొనడానికి వెళ్లింది జుబేదా. మా వారి సెలక్షన్ చాలా బాగుంటుంది, మా అమ్మాయి కోసం నగలు కొనడానికి ఆయన్ను తీసుకొచ్చానంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. తీరా నగల దుకాణంలోకి వెళ్లాక మా అమ్మాయి కోసం అని చెప్పాను, కానీ నేను కూడా నగలు తీసుకుంటున్నాను అని ఝలక్ ఇచ్చింది. ఇంట్లో పెళ్లికి ఇల్లాలు కొనుక్కోకపోతే ఎలా అనుకున్న అలీ భార్య కోరుకున్నంత బంగారం కొనిచ్చాడు. ఏడు వారాల నగలు మాత్రం వద్దంటూనే కాస్ట్‌లీ ఆభరణాలు సెలక్ట్ చేసి బిల్లు కట్టాడు.
చదవండి: అల్లు అరవింద్‌కు నలుగురు కుమారులని మీకు తెలుసా?
చిరంజీవిని పెళ్లికి ఆహ్వానించిన అలీ దంపతులు
Comments
Please login to add a commentAdd a comment