'గుంటూరుకు తరలి రానున్న సినిమా పరిశ్రమ'
గుంటూరు: సినీ రంగానికి ఎంతోమంది కళాకారులను అందించిన గుంటూరు జిల్లా త్వరలో కల్చరల్ హబ్‌గా రూపుదిద్దుకోనున్నదని సినీనటుడు ఆలీ చెప్పారు. గుంటూరులో ఆదివారం ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 కె వాక్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
త్వరలో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాజధానైన గుంటూరుకు తరలి రానున్నదని చెప్పారు. సినిమా షూటింగ్‌కు ఇక్కడ ఆహ్లాదకరమైనా వాతావరణం ఉందన్నారు. శిల్పరామం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరగనుందని చెప్పారు. గాయకుడు మనో మాట్లాడుతూ త్వరలో సామాజిక, ఆధ్యాత్మిక సంగీత ఆల్బమ్స్‌ను నవ్యాంధ్రలో రూపొందించనున్నట్టు తెలిపారు. సినీనటులు నిఖిత, సౌమ్య, మాధవీలత పాల్గొన్నారు.