Comedian Ali Reveals About His First Love Story, Deets Inside - Sakshi
Sakshi News home page

Comedian Ali Love Story: అదే నా ఫస్ట్‌ లవ్‌స్టోరీ.. ఓ రోజు ఆమె వర్షంలో తడుస్తుంటే..

Published Wed, Dec 21 2022 6:47 PM | Last Updated on Wed, Dec 21 2022 7:10 PM

Comedian Ali Reveals His First Love Story - Sakshi

హీరోగా, హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు అలీ. ఇటీవలే తన పెద్దకూతురికి ఘనంగా పెళ్లి చేసి తండ్రిగా తన బాధ్యత తీర్చుకున్నాడు. ఇక పెళ్లికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని యూట్యూబ్‌ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంది అమె భార్య జుబేదా. ఆ వీడియోల్లో అలీ దంపతులను చూసినవారెవరైనా వీరిది అన్యోన్య దాంపత్యం అని మెచ్చుకోక మానరు. అయితే జుబేదా కంటే ముందు వేరొకరిపై మనసు పారేసుకున్నాడట అలీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.

'అప్పుడు నా వయసు 17 అనుకుంటా! మా ఇంటి పక్కన ఓ అమ్మాయి ఉండేది. ఆమె కళ్లు చాలా బాగుంటాయి. పొడుగైన జుట్టు.. అందంగా ఉండేది. నన్ను చూసి చిన్న నవ్వు విసిరేది. ఒకరోజు ఆమె వర్షంలో తడుచుకుంటూ వస్తోంది. నేను ఎదురుగా వెళ్లి గొడుగు పట్టాను. అలా మా మధ్య బాగానే నడిచింది. 21 ఏళ్లు వచ్చాక అమ్మ దగ్గరకు వెళ్లి ఆమెకు తండ్రి లేడు, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అమ్మ సరేనంది. ఆ తర్వాత ఒకరోజు అమ్మ తమ్ముడితో పాటు సినిమాకెళ్లింది. ఆ థియేటర్‌కు అమ్మాయి తన స్నేహితులతో కలిసి వచ్చింది. ఇంటికి వచ్చాక అమ్మ ఆ అమ్మాయే వద్దని చెప్పింది. దీంతో ఆ అమ్మాయి వంక చూడటం మానేసి బుద్ధిగా నా పని నేను చూసుకున్నాను. తర్వాత పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఒకమ్మాయి నన్ను రిజెక్ట్‌ చేసింది. దీంతో నాకు కోపం వచ్చి అదే కుటుంబంలో ఉన్నవాళ్లనే పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్పాను. అలా అక్కను చూడటానికి వెళ్లి ఆమె చెల్లి జుబేదాను చేసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు అలీ.

చదవండి: ఆమె మంటల్లో కాలిపోయింది.. నా కూతురికి ఆమె పేరే పెట్టుకున్నా: అలీ
షారుక్‌ ఖాన్‌ను సజీవ దహనం చేస్తా: అయోధ్య సాధువు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement