Comedian Ali Gets Emotional Over Remembering About His Sister Death, Deets Inside - Sakshi
Sakshi News home page

Comedian Ali: సజీవదహనం.. నా కూతురికి ఆమె పేరే పెట్టుకున్నాను..

Published Wed, Dec 21 2022 4:14 PM | Last Updated on Sat, Dec 24 2022 4:28 PM

Comedian Ali Gets Emotional Over Remembering Her Sister Death - Sakshi

అందరినీ నవ్వించే కమెడియన్‌ అలీ స్టార్‌ సెలబ్రిటీలను సైతం ఇంటర్వ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే! తాజాగా అతడిని ఇంటర్వ్యూ చేసింది యాంకర్‌ సుమ. ఈ సందర్భంగా అలీ ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నాడు. తన కుటుంబంలో జరిగిన ఓ విషాద ఘటనను బయటపెట్టాడు. 

'నా ఎనిమిదేళ్ల వయసులో మా పెద్దక్క ఫాతిమా ఒక ప్రమాదంలో చనిపోయింది. అదెలాగంటే.. అప్పటికే ఆమెకు ఒక బాబు పుట్టాడు. రెండోసారి గర్భవతి అయినప్పుడు ఆమె పిల్లాడికి పాలు వేడి చేసింది. పాలు గ్లాసులో పోసేటప్పుడు చున్నీని వెనకేసుకోగా దానికి మంట అంటుకుంది. అలా ఆ మంటలు తన ఒళ్లంతా వ్యాపించాయి. ఇంట్లో నుంచి అలానే బయటకు రావడంతో అక్కడున్నవాళ్లు చూసి ఆమెపై నీళ్లు గుమ్మరించారు. అయినా ఆమె ప్రాణాలతో దక్కలేదు. కడుపులో ఉన్న బిడ్డతో పాటు ఆమె కూడా చనిపోయింది. చిన్నప్పుడు ఆవిడ నా మీద ఎక్కువ ప్రేమ చూపించేది. నేను పొద్దున నిద్ర లేవకపోతే తనే కేర్‌ తీసుకుని నన్ను నిద్ర లేపి రెడీ చేసి షూటింగ్‌కు పంపేది. ఆమె మీదున్న అభిమానంతోనే నా పెద్ద కూతురుకు ఫాతిమా పేరు పెట్టుకున్నా. ఈ మధ్యే తన పెళ్లి కూడా చేశాను' అని చెప్పుకొచ్చాడు అలీ.

చదవండి: నేనొక నటుడ్ని.. అమాయకుణ్ణి.. చిరంజీవి
షారుక్‌ ఖాన్‌ కనిపిస్తే తగలబెడ్తా.. అయోధ్య సాధువు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement