ఆ వీడియోలను తొలగించేందుకు ఓకే!
న్యూఢిల్లీ: అమలులో ఉన్న ఏ చట్టాన్నైనా ఉల్లంఘించేలా యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను తొలిగించేందుకు ఆ సంస్థ ఒప్పుకుందని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే వీడియోలను తాము ఉపేక్షించమని యూట్యూబ్ సంస్థ చెప్పినట్లు న్యాయమూర్తి ఎస్.మురళీధర్ పేర్కొన్నారు. ఐటీ మార్గదర్శకాలకు లోబడి పనిచేస్తామని యూట్యూబ్ తెలిపిందన్నారు.
టాటా స్కై తొలగించమని చెప్పిన వీడియో లింకులను తొలగించాలని గతేడాది ఆగస్టు 27న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా అభ్యంతకర వీడియోలకు సంబంధించిన లింకులు తొలగించామని న్యాయస్థానానికి ఈ ఏడాది ఆగస్టు 10న యూట్యూబ్ సంస్థ తెలిపింది.