ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్‌కు చెందిన యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌పై భారీగా వీడియోలను తొలగించేసింది. కంటెంట్ పాలసీ ఉల్లంఘన చేపడుతుందనే ఆరోపణలతో ఈ వీడియోలను తీసేసింది. గతేడాది నాలుగో త్రైమాసికంలో ఎవరూ చూడకముందే 60 లక్షలకు పైగా వీడియోలను తొలగించినట్టు కంపెనీ తన గణాంకాల్లో పేర్కొంది. తొలగించిన వీడియోల్లో ఎక్కువగా స్పామ్ లేదా అడల్డ్ కంటెంటే ఉన్నట్టు కంపెనీ తెలిపింది. యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌పై సరియైన కంటెంట్ పాలసీని చేపట్టడం లేదని ఎంతో కాలంగా విమర్శలు ఎదుర్కొంటోంది. గత రెండేళ్లుగా దిగ్గజ కంపెనీలు సైతం యూట్యూబ్‌కు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం మానేశాయి. తమ ప్రకటనలను అతివాద, ద్వేషపూరిత కంటెంట్ పక్కన చూపిస్తుందంటూ ఆరోపిస్తూ కంపెనీ వ్యాపార ప్రకటనలను ఇవ్వడం నిరాకరిస్తున్నాయి.
యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న అతివాద కంటెంట్‌ను చట్టసభ్యులు సైతం పరిశీలిస్తున్నారు. అలాంటి వీడియోలను తొలగించడానికి యూట్యూబ్ శాయశక్తుల ప్రయత్నిస్తోంది. సోమవారం గూగుల్ తన ఫలితాల ప్రకటన సందర్భంగా ఈ విషయాలను వెల్లడించింది. మంచి కంటెంట్‌తో యూట్యూబ్‌ను సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌గా రూపొందిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. తమ కంటెంట్ పాలసీని ఉల్లంఘించే వీడియోల విషయంలో కంపెనీ దర్యాప్తు సంస్థలకు కానీ మేథోసంపత్తి హక్కుల యజమానులకు కానీ స్పష్టమైన వివరాలు ఇవ్వలేమని యూట్యూబ్ పేర్కొంది. అప్‌లోడర్స్, హక్కుదారులను అంత తేలికగా గుర్తించలేమని చెప్పింది. ఎవరైనా కాపీరైట్ ఓనర్లు తమ హక్కులను ఏమైనా వీడియో హరిస్తుంది అని గుర్తిస్తే యూట్యూబ్‌కు రిపోర్టు చేయాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment