
నవజాత శిశువును చూపుతున్న 108 సిబ్బంది
చెన్నై: కడలూరు ముత్తునగర్ సమీపంలో గురువారం వేకువజామున అంబులెన్స్‌లో ఓ మహిళ ప్రసవించింది. వివరాలు.. కడలూరు ముత్తునగర్ సమీపంలోని సేదపాళ్యం గ్రామానికి చెందిన ప్రశాంత్ భార్య శరణ్య (22). గురువారం తెల్లవారుజామున ప్రసవ నొప్పి రావడంతో బంధువులు ఆమెను 108 అంబులెన్స్‌లో తొండమానత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. దారిలో శరణ్యకు ప్రసవం నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో డ్రైవర్ చరణ్ రాజ్ అంబులెనన్స్‌ను రోడ్డు పక్కన ఆపాడు. ఎమర్జెన్సీ టెక్నీషియన్ (నర్సు) దశరథ డెలివరీ చేశారు. శరణ్య అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, బిడ్డనితొండమానత్తం పీహెచ్‌సీలో చేర్పించారు.
8 వరకు మెడ్ స్టార్ సమ్మిట్
సాక్షి, చైన్నె: చైన్నెలో మెడ్ స్టార్ సమ్మిట్–2023 ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సవిత వైద్య కళాశాల, ఐసీఎంఆర్‌ల నేతృత్వంలో ఈ కార్యక్రమం గత కొద్దిరోజులుగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ పద్మ ప్రియదర్శిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠ్యాంశాలు, పరిశోధనలు, అసాధారణ ఏకీకరణ తదితర అంశాల గురించి చర్చించారు. 540 మంది పోస్టర్ ప్రెజెంటేషన్ చేశారు. ఇందులో ప్రత్యేకంగా 1000 అడుగులతో రూపొందించిన పోస్టర్ ప్రెజెంటేషన్, విద్యార్థుల పరిశోధన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.