న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి అక్కడక్కడ అవమానాలు ఎదురవుతున్నాయి. కోవిడ్-19 పోరుపై మనల్ని గెలిపించడానికి అనుక్షణం యుద్ధం చేస్తున్న వైద్యనారాయణులను సముచితంగా గౌరవిస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. ఇలాంటి అపురూప ఘటనకు సంబంధించిన ఒక వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
కోవిడ్-19 బాధితులకు నిర్విరామంగా 20 రోజుల పాటు ఐసీయూలో వైద్య సేవలు అందించిన ఇంటికి తిరిగొచ్చిన మహిళా వైద్యురాలిని ఆమె కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు పూలతో స్వాగతించిన అపురూప ఘట్టం ఈ వీడియోలో ఉంది. చప్పట్లు, ప్లకార్డులతో ఊహించని విధంగా తనకు లభించిన సాదర స్వాగతానికి సదరు మహిళా వైద్యురాలు భావోద్వేగానికి గురైన అపురూప క్షణాలు అందులో ఉన్నాయి.
‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. ఇది భారతదేశం యొక్క ఆత్మ. మనం ధైర్యంగా కోవిడ్-19తో పోరాడుతున్నాం. ముందుండి పనిచేసేవారంటే మనకెంతో గర్వకారణమ’ని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళా వైద్యురాలిపై నెటిజనులు అభినందనలు కురిపిస్తున్నారు. (కరోనా విపత్తు: భారీ ఉపశమనం)
Comments
Please login to add a commentAdd a comment