మోదీగారు వారిని అన్‌ఫాలో చేయండి! | Kejriwal asks Modi to unfollow trolls who abuse on Twitter | Sakshi
Sakshi News home page

మోదీగారు వారిని అన్‌ఫాలో చేయండి!

Published Wed, Mar 8 2017 1:25 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

మోదీగారు వారిని అన్‌ఫాలో చేయండి! - Sakshi

మోదీగారు వారిని అన్‌ఫాలో చేయండి!

మహిళలను వేధించేవారిని, బెదిరించేవారిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేయాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన ప్రధాని మోదీకి ఈ విజ్ఞప్తి చేశారు. మహిళలను వేధించేవారిని ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేయడమే కాదు.. వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో కోరారు.

ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో నిరసనగళం ఎత్తిన లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని గుర్మెహర్‌ కౌర్‌కు రేప్‌ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ బీజేపీని ఇరకాటంలో పెట్టేలా ఈ కామెంట్‌ చేశారు. ఆయన కామెంట్‌ను ఆప్‌ మద్దతుదారులు విపరీతంగా రీట్వీట్‌ చేస్తుండగా.. ఆయన ప్రత్యర్థులు మాత్రం తప్పుబడుతున్నారు. విడిపోయిన భార్య నుంచి గృహహింస కేసు ఎదుర్కొంటున్న ఆప్‌ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతిని ట్విట్టర్‌లో కేజ్రీవాల్‌ ఫాలో అవుతుండటాన్ని తప్పుబడుతున్నారు. ముందు ఆయన అన్‌ఫాలో చేసి.. ఇతరులకు హితబోధ చేయాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement