చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్‌ | Swati Maliwal Tweet On Threats To Her | Sakshi
Sakshi News home page

చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్‌

Published Sun, May 26 2024 4:07 PM | Last Updated on Sun, May 26 2024 4:26 PM

Swati Maliwal Tweet On Threats To Her

న్యూఢిల్లీ: చంపేస్తామని, అత్యాచారం చేస్తామని తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ఎంపీ స్వాతి మలివాల్‌ అన్నారు. తన మీద సీఎం కేజ్రీవాల్‌ ఇంట్లో జరిగిన దాడి ఘటనపై ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో వన్‌సైడ్‌ వీడియో పెట్టారని, ఆ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. 

ఈ మేరకు ఆదివారం(మే26) ఎక్స్‌(ట్విటర్‌)లో ఆమె ఒక ట్వీట్‌ చేశారు. యూట్యూబ్‌ ఛానళ్లు నడిపే ఇండిపెండెంట్‌ జర్నలిస్టులు కూడా ఆప్‌ అధికార ప్రతినిధుల అవతారమెత్తడం సరికాదన్నారు. 

దాడి ఘటనపై  ఆ జర్నలిస్టులకు తన వెర్షన్‌ చెప్పుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫోన్లు ఎత్తడం లేదన్నారు. తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తమ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement