జైలులో పెట్టినా పోరాడతా: స్వాతి
న్యూఢిల్లీ: కొంత మంది వ్యక్తులు కేంద్రకానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ మహిళ కమిషన్(డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఆరోపించారు. తాము ప్రశ్నించడం ఇష్టంలేని కొంత మంది వ్యక్తులు ఇదంతా చేస్తున్నారని అన్నారు. వీరి పేర్లు వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు. తాను ఎవరిపైనా అకారణంగా నిందలు వేయాలనుకోవడం లేదన్నారు. ఏసీబీ కేసులతో తమను ఆపలేరని పేర్కొన్నారు. తనను జైలులో పెట్టినా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
డీసీడబ్ల్యూ సిబ్బంది నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో స్వాతి మలివాల్ ను ఏసీబీ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిని డీసీడబ్ల్యూలో అక్రమంగా నియమించినట్టు మాజీ అధ్యక్షురాలు బర్కా శుక్లా ఫిర్యాదు చేయడంతో ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.