DCW chief
-
ఢిల్లీ పోలీసులపై మాలివాల్ అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా సంఘం చీఫ్ కమిషనర్ స్వాతి మాలివాల్ బుధవారం ఢిల్లీ అధికారులను కలిశారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసాకాండ వల్ల ఒత్తిడికి లోనవుతున్న బాధిత మహిళల నుంచి తమ ప్యానల్‌కు ముకుమ్ముడిగా ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులకు తెలిపారు. అదే విధంగా స్పెషల్ పోలీసు కమిషనర్(శాంతి భద్రతల) అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవను కూడా డీసీపీ కార్యాలయంలో కలిశారు. ఈ క్రమంలో కరావల్ నగర్, దయల్పూర్, భజన్‌పురా, గోకుల్‌పురి ఇతర ప్రాంతాల మహిళల నుంచి వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయనకు వెల్లడించారు. సీఏఏ అల్లర్లు : సీబీఎస్ఈ పరీక్ష వాయిదా ఢిల్లీ పోలీస్ చీఫ్‌గా ఎస్ఎన్ శ్రీవాస్తవ ఈ సందర్బంగా మాలివాల్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘మా కమిషన్‌కు పలు ప్రాంతాల మహిళలు తరచూ 181 హెల్స్ లైన్ ద్వారా నిరంతరం ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులకు పంపిస్తున్నాము. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే సీలాంపూర్‌లో ఉన్నత పోలీసు అధికారులను కలిసి విషయం వివరించాము’ అని చెప్పారు. అంతేగాక పోలీసుల తీరుపై అసంతృప్తి చెందిన మాలివాల్.. తన కమిషన్ సభ్యులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లానని, అక్కడ అల్లర్ల వల్ల పరిస్థితులు తీవ్రంగా మారాయని తెలిపారు. ఇక ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తాను సీనియర్ పోలీసు అధికారులను కలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవను కలిసి తమకు వచ్చిన ఫిర్యాదులన్నింటిని ఆయనకు అందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కాగా ప్రతి ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక ప్రతి ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్‌కు ఇవ్వాల్సిందిగా తన బృందానికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
మహిళ నగ్న ఊరేగింపు.. సీఎం స్పందన
-
మహిళ నగ్న ఊరేగింపు.. సీఎం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. లిక్కర్ మాఫియా గురించి సమాచారం అందించిన ఓ మహిళను కొట్టి నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. దీనిపై ఢిల్లీ మహిళా కమీషన్ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. పోలీస్ చౌకీ సమీపంలో నివసించే మహిళ ప్రవీణ్.. నారెళ్లలో ఇల్లీగల్‌గా లిక్కర్ అమ్ముతున్న కొందరి గురించి ఢిల్లీ మహిళా కమీషన్‌కు సమాచారం అందించింది. దీంతో వారు దాడులు నిర్వహించి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే ఆ మాఫియాకు చెందిన ఓ మహిళ కొందరు పురుషులతో కలిసి సమాచారం అందించిన ప్రవీణ్‌పై గురువారం దాడికి తెగబడ్డారు. రాడ్లతో ఆమెను కొడుతూ నగ్నంగా రోడ్డుపై ఊరేగించారు. ఆ దాష్టీకం మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. స్థానిక పోలీసులు మాత్రం కేవలం ఆమెపై దాడి మాత్రమే జరిగిందని.. ఆ ఘటనలో ఆమె బట్టలు చినిగిపోయాయని చెబుతున్నారు. పోలీసుల వివరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీడబ్ల్యూ పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేసింది. ప్రవీణ డీసీడబ్ల్యూ వాలంటరీగా పని చేస్తోందని.. ఆమెకు అవమానం జరిగిన మాట వాస్తవమని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ అంటున్నారు. ఈ మేరకు రోహిణి డిప్యూటీ కమిషనర్ రాజ్నీశ్ గుప్తాను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. సిగ్గు చేటు.. సీఎం కేజ్రీవాల్ కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవీల స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి.. స్పందించని పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. Utterly shocking and shameful that this is happening in the capital of India. I urge Hon’ble LG to immediately intervene, take action against local policemen and ensure everyone’s safety https://t.co/Den926EgML — Arvind Kejriwal (@ArvindKejriwal) December 7, 2017 -
'ఎఫ్ఐఆర్లో నన్నెందుకు చేర్చారో తెలియడం లేదు'
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరును ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను ఏం చేశాననే విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని చెప్పారు. 'ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నా పేరు ఎందుకు చేర్చారో తెలియదు. ఇందులో నా పాత్ర ఏముంది? అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎఫ్ఐఆర్ వెనుక కుట్ర ఏమిటో తేల్చుకునేందుకు త్వరలోనే ప్రత్యేక విధాన సభ సమావేశం ఏర్పాటుచేసి పూర్తి స్థాయిలో చర్చిస్తామని అన్నారు. మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని స్వాతి మలివాల్ పై కేసు నమోదు చేసిన అధికారులు ఇప్పటికే ఆమెను ప్రశ్నించారు. డీసీడబ్ల్యూ మాజీ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ విచారణ చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిని డీసీడబ్ల్యూలో అక్రమంగా నియమించినట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఎటువంటి అర్హతలు లేకపోయినా 85 మందిని నియమించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను స్వాతి మలివాల్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. -
జైలులో పెట్టినా పోరాడతా: స్వాతి
న్యూఢిల్లీ: కొంత మంది వ్యక్తులు కేంద్రకానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ మహిళ కమిషన్(డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఆరోపించారు. తాము ప్రశ్నించడం ఇష్టంలేని కొంత మంది వ్యక్తులు ఇదంతా చేస్తున్నారని అన్నారు. వీరి పేర్లు వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు. తాను ఎవరిపైనా అకారణంగా నిందలు వేయాలనుకోవడం లేదన్నారు. ఏసీబీ కేసులతో తమను ఆపలేరని పేర్కొన్నారు. తనను జైలులో పెట్టినా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. డీసీడబ్ల్యూ సిబ్బంది నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో స్వాతి మలివాల్ ను ఏసీబీ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిని డీసీడబ్ల్యూలో అక్రమంగా నియమించినట్టు మాజీ అధ్యక్షురాలు బర్కా శుక్లా ఫిర్యాదు చేయడంతో ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. -
స్వాతి మలివాల్‌ను ప్రశ్నించిన ఏసీబీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్(డీసీడబ్ల్యూ) స్వాతి మలివాల్‌ను ఏసీబీ అధికారులు సోమవారం ప్రశించారు. మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐదుగురు అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఈ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకుని స్వాతిని ప్రశ్నించిందని ఏసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. గతవారం ఆమెకు ఏసీబీ నోటీసు జారీ చేసింది. డీసీడబ్ల్యూ మాజీ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిని డీసీడబ్ల్యూలో అక్రమంగా నియమించినట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఎటువంటి అర్హతలు లేకపోయినా 85 మందిని నియమించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను స్వాతి మలివాల్ తోసిపుచ్చారు. నిబంధనల మేరకే సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. -
'వాళ్లను వెంటనే ఉరి తీయండి'
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులను ఉరి తీయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు. భవిష్యత్ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే రేపిస్టులకు మరణశిక్ష అమలు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో స్వాతి స్పందించారు. 'వ్యవస్థ దేన్నైతే సమర్థించిందో, దాన్నే వినయ్ శర్మ తనకు తానుగా విధించుకోబోయాడు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష వెంటనే అమలు చేయాలి. ఒక్క నిర్భయ దోషులనే కాదు, అత్యాచారానికి పాల్పడిన ప్రతి ఒక్కరికి మరణశిక్ష విధించాలి. మరెవరూ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా గట్టి హెచ్చరికలు పంపాల'ని స్వాతి అన్నారు. జైలు అధికారులు వేధించడం వల్లే వినయ శర్మ ఆత్మహత్యకు ప్రయత్నించాడని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు.