'వాళ్లను వెంటనే ఉరి తీయండి' | Nirbhaya’s rapists need to be given death penalty immediately: Swati Maliwal | Sakshi
Sakshi News home page

'వాళ్లను వెంటనే ఉరి తీయండి'

Published Fri, Aug 26 2016 11:07 AM | Last Updated on Wed, Oct 17 2018 5:52 PM

'వాళ్లను వెంటనే ఉరి తీయండి' - Sakshi

'వాళ్లను వెంటనే ఉరి తీయండి'

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులను ఉరి తీయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు. భవిష్యత్ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే రేపిస్టులకు మరణశిక్ష అమలు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో స్వాతి స్పందించారు.

'వ్యవస్థ దేన్నైతే సమర్థించిందో, దాన్నే వినయ్ శర్మ తనకు తానుగా విధించుకోబోయాడు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష వెంటనే అమలు చేయాలి. ఒక్క నిర్భయ దోషులనే కాదు, అత్యాచారానికి పాల్పడిన ప్రతి ఒక్కరికి మరణశిక్ష విధించాలి. మరెవరూ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా గట్టి హెచ్చరికలు పంపాల'ని స్వాతి అన్నారు. జైలు అధికారులు వేధించడం వల్లే వినయ శర్మ ఆత్మహత్యకు ప్రయత్నించాడని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement