ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వృద్ధాశ్రమం నడుపుతున్న ఓ ఎన్జీవో నిర్వాకానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 19 మంది వృద్ధులను ఓ గదిలో బంధించి.. వారిని తీవ్రంగా కొట్టిన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయిలో ఓ ఎన్జీవో వృద్ధాశ్రమం నిర్వహిస్తోంది. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేవని, వృద్ధులు దయనీయమైన జీవితం గడుపుతున్నారని సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందింది.(అమానుషం: పోలీసుల ముందే పాశవిక దాడి!)
ఈ నేపథ్యంలో ఢిల్లీ స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతం, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఎన్జీవో సభ్యులు వృద్ధులను ఓ చిన్న గదిలో బంధించి, హింసించినట్లు గుర్తించారు. అదే విధంగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కనీస నిబంధనలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఉంచినట్లు తేలింది. దీంతో వెంటనే వాళ్లను అక్కడి నుంచి మరో చోటికి తరలించారు. ఇక ఈ అమానవీయ ఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి గౌతం తక్షణ విచారణకు ఆదేశించారు. ఎన్జీవో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment