ఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ని రాజ్యసభ అభ్యర్థిగా ఆప్ నామినేట్ చేసింది. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలను పార్లమెంటు ఎగువ సభకు ఆప్ మరోసారి నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఈరోజు నామినేషన్లను ప్రకటించింది.
స్వాతి మలివాల్ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలను రెండవసారి రాజ్యసభ సభ్యులుగా కొనసాగించాలని ఆప్ నిర్ణయించింది. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాల ప్రస్తుత పదవీకాలం జనవరి 27, 2024తో ముగియనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సంజయ్ గుప్తా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఆప్ అభ్యర్థన మేరకు సంజయ్ సింగ్ నామినేషన్ పత్రాలపై సంతకం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
రాజ్యసభ సభ్యునిగా పదవీ కాలం ముగుస్తున్న సుశీల్ కుమార్ గుప్తా స్థానంలో స్వాతి మాలీవాల్‌కు అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది జరగనున్న హర్యానా ఎన్నికల్లో ఆప్ పోటీ చేయాలనుకుంటోంది. సుశీల్ కుమార్ గుప్తాకు హర్యానా బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఎగువ సభలో రాఘవ్ చద్దా, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా ఆప్‌కి ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు. పంజాబ్‌లో విజయం తర్వాత రాజ్యసభలో ఆప్ బలం గణనీయంగా పెరిగింది. అటు.. ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు జనవరి 3న ప్రారంభమయ్యాయి. జనవరి 19న పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లలో ఆప్‌కి 62 స్థానాలు ఉన్నందున అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీ సర్కార్‌కు షాక్.. మొహల్లా క్లినిక్‌లపై సీబీఐ దర్యాప్తు
Comments
Please login to add a commentAdd a comment