ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం 'వికాస్' లేదా అభివృద్ధి నమూనాను అనుసరిస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం 'వినాశ్' లేదా విధ్వంసం నమూనాను అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఇటీవల ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను ఆప్-కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని విశ్వసిస్తున్నామని, ప్రజలు కూడా పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద కుటుంబంలోని ప్రతి మహిళకు రూ.1000 అందజేస్తామని కేజ్రీవాల్ తెలియజేసారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను గుర్తు చేసుకుంటూ.. వచ్చే ఏడాది ఆయన అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ఆశిస్తున్నాను అని అన్నారు.
సొసైటీలోని ప్రతి విభాగాన్ని జాగ్రత్తగా గమనించి అద్భుతమైన బడ్జెట్‌ను సమర్పించినందుకు ఆర్థిక మంత్రి 'అతిషి మర్లెనా'ను కేజ్రీవాల్ ప్రశంసించారు. అంతే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీని అంతమొందించాలని బీజేపీ భావిస్తోందని, తనను జైలుకు పంపేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment