(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ, ఆప్ వేర్వేరుగా.. ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని ఓ ఒప్పదం చేసుకున్నట్లు వెల్లడించారు. పంజాబ్‌లో ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేయటంపై ఎటువంటి అభిప్రాయ బేధాలు లేవని స్పష్ట చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేఖ్ సింఘ్వీ నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
‘ఇరు పార్టీల ఒప్పందం ప్రకారమే పంజాబ్‌లో ఒంటగా పోటీ చేస్తున్నాం. ఈ విషయంలో ఎటువంటి బేధాభిప్రాయాలు, వివాదం కానీ లేవు’ అని కేజ్రీవాల్ తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా ఢిల్లీలో సీట్లపంపకంపై చర్చలు చివరికి వచ్చాయని తెలిపారు.
‘ఢిల్లీలో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాం. ఢిల్లీలో ఇరుపార్టీల మధ్య సీట్ల పంపిణీ కసరత్తు జరుగోతోంది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తులేకపోతే బీజేపీకి తేలిక అవుతుంది’ అని కేజ్రీవాల్ అన్నారు.
ఇక.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏడు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఏడు స్థానాల్లో బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 సీట్లలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని రాష్ట్ర సీఎం భగవంత్‌సింగ్ మాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆప్ నిర్ణయాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ కూడా పంజాబ్‌లో ఒంటరిగానే బరిలోకి దిగాలనుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment