న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ మార్చి 23న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం కేజ్రీవాల్ పిటీషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ వాదనలు వినిపిస్తున్నారు. తన క్లైంట్ అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేముందు ఆయన నివాసం వద్ద ఎటువంటి స్టేట్‌మెంట్ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అరెస్టకు ముందు ఈడీ అసలు అటువంటి ప్రయత్నమే చేయలేదని కోర్టుకు తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్ పారిపోయే అవకాశం ఉందా?. ఆయన ఒకటిన్నర ఏళ్లలో ఎవరైనా సాక్షిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారా?. ప్రశ్నించడానికి నిరాకరించారా? అని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ ఈడీని ప్రశ్నించారు.
అంతకుముందు హైకోర్టులో హాజరుపరిచే క్రమంలో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో నన్ను అవమానపరిచేందుకు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ఆపేందుకు అరెస్టు చేశారు. ఈడీ నా నుంచి ఎలాంటి స్టెట్‌మెంట్ రికార్డ్ చేయలేదు’ అని అన్నారు. ఇక.. ఈడీ కస్టడీ ముగిసిన అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు సోమవారం జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. అయన్ను తీహార్ జైల్‌క తరలించారు. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. మార్చి 21 తేదీన సాయంత్రం ఈడీ రెండున్నర గంటల పాటు విచారించి.. అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment