ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆప్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. అయితే మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. శనివారం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పంపిన సందేశాన్ని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలకు చదివి వినిపించారు. ఈ వీడియో సందేశంపై కూడా బీజేపీ విమర్శలు చేసింది బీజేపీ.
అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సందేశాన్ని చదివే క్రమంలో ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఎంతో బాధపడ్డారని ఆ బాధకు కేజ్రీవాల్ బాధ్యత వహించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. ‘సునితా కేజ్రీవాల్ ఎంతో బాధతో మాట్లాడారు. దానికి సీఎం కేజ్రీవాల్ బాధ్యత వహించాలి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ సౌకర్యాలు, ఇల్లు, కారు, భద్రత తీసుకుంటున్నప్పుడు ఇలా మీడియా ముందుకు వస్తే బాగుండేది. కేజ్రీవాల్ గ్రాండ్ బంగ్లాలోకి వెళ్లినప్పుడు, ఢిల్లీ పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అయినప్పుడు. ఢిల్లీ యువతకు మద్యం ఉచితంగా ఇచ్చినప్పుడు, కేజ్రీవాల్ ద్వారా రూ. 100 కోట్ల లావాదేవీలు జరిగినప్పుడే సునితా కేజ్రీవాల్ ఇలా మీడియా ముందుకు రావాల్సింది’ అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతో కాంగ్రెస్ ఇబ్బంది పడి.. ప్రస్తుతం మాత్రం ఆప్‌కు కాంగ్రెస్‌కు మద్దతు నిలుస్తోంది. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఈ లిక్కర్ స్కామ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ సైతం.. షిలా దీక్షిత్, సోనియా గాంధీలపై విమర్శలు గుప్పించారు. ఆప్, కాంగ్రెస్ అవినీతి పార్టీలు.. వారి మధ్యే ఎన్నికల పోటీ ఉండాలనుకుంటున్నారు’ అని వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు.
సునితా కేజ్రీవాల్ శనివారం ఈడీ కార్యాలయంలో అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. ఇక..అరవింద్ కేజ్రీవాల్‌ను మర్చి 28 వరకు ఢిల్లీ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తన అరెస్ట్ రిమాండ్‌పై ఢిల్లీ హైకోర్టును శనివారం ఆశ్రయించగా అత్యవసరంగా విచారించటం వీలుకాదని పేర్కొంది. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment