ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ 'అరవింద్ కేజ్రీవాల్' లోక్‌సభ 2024 ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కేజ్రీవాల్ హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మొద్దని వ్యాఖ్యానించారు.
సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. హిందూ ఇతిహాసమైన మహాభారతాన్ని ఉదాహరణగా వెల్లడిస్తూ.. రాబోయే ఎన్నికలు 'ధర్మం - అధర్మం' మధ్య జరిగే పోరు అని వ్యాఖ్యానించారు. ఈ సారి పొరపాటున కూడా బీజేపీకి ఓటేయొద్దని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు.
కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల దగ్గర అన్నీ ఉన్నా.. యుద్ధంలో గెలువలేకపోయారు. కానీ పాండవుల దగ్గర ఏమీ లేదు, కానీ శ్రీకృష్ణుడు మాత్రమే ఉన్నారు. యుద్ధంలో గెలిచారు. మేము చిన్న వాళ్ళమే కావొచ్చు. మాతో శ్రీకృష్ణుని ధర్మం ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేయొద్దని, ప్రజలు బాగా ఆలోచించి మీ నియోజక వర్గంలో మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. కష్ట సమయంలో మీ కోసం పనిచేసే నాయకుడు మీకు ప్రజా ప్రతినిధిగా ఎన్నికైతే అవసరాలకు ఉపయోగపడతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment