ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరెస్ట్, ఈడీ రిమాండ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు శనివారం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. రిమాండ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. కాగా.. ఈడీ మార్చి 28 వరకు తమ క్లైంట్‌కు ఈడీ కస్టడీ విధించటం చట్టవిరుద్ధమని సీఎం కేజ్రీవాల్ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. మార్చి 24 ఆదివారంలోపు తను దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్‌లో కోరారు. అత్యవసర విచారణ కోసం కేజ్రివాల్ తరపు అడ్వకేట్ ప్రయత్నం చేశారు. కాగా.. ఢిల్లీ హైకోర్టు అత్యవసరణ విచారణకు అనుమతించకపోవటం గమనార్హం.
ఇక.. గురువారం ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. నిన్న శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టుకు హాజరుపరిచి.. ఈడీ పదిరోజుల కస్టడీకి కోరింది. దీంతో కోర్టు ఆరు రోజుల పాటు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే.
చదవండి: కేజ్రీవాలే అసలు కుట్రదారు
Comments
Please login to add a commentAdd a comment