ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ రిమాండ్, కస్టడీని సవాల్ చేస్తూ.. సీఎం కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జూన్ 26న ట్రయల్ కోర్టు ఇచ్చిన మూడు రోజుల సీబీఐ రిమాండ్‌ను సీఎం కేజ్రీవాల్ సవాల్ చేశారు. అదే విధంగా శనివారం (జూన్ 29) రౌస్ అవెన్యూ కోర్టు.. జూలై 12 వరకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐ అభ్యర్థన మేరకు వెకేషన్ జడ్జి సునేనా శర్మ శనివారం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించారు. మూడు రోజుల సీబీఐ రిమాండ్ విచారణ ముగిసిన తర్వాత ట్రయల్ కోర్టు హాజరైన క్రేజ్రీవాల్‌ను 14 రోజుల సీబీఐ కస్టడీ విధించారు. ఈ క్రమంలో సోమవారం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ రిమాండ్, కస్టడీపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment