ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ 'అరవింద్ కేజ్రీవాల్'ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం రాత్రి అరెస్టు చేసింది. కేజ్రీవాల్ అరెస్టును పార్టీ నేతలు మాత్రమే కాకుండా.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్, టీఎంసీ వంటి పార్టీలు ఖండిస్తున్నాయి.
లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మొదటిసారి స్పందిస్తూ.. నేను ఎక్కడ ఉన్నా దేశం కోసం పనిచేస్తానని ''నా జీవితం జాతికి అంకితం'' అని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు జరిగిన రాజకీయ కుట్రగా ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది.
కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనకు పార్టీ పిలుపునిచ్చింది. నిరసనలో పాల్గొన్న ఢిల్లీ కేబినెట్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, తూర్పు ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి కుల్‌దీప్ కుమార్‌తో సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ రూస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరిచింది.
#WATCH | "Whether I am inside or outside, my life is dedicated to the country," said arrested Delhi CM Arvind Kejriwal as he was produced before Rouse Avenue court by ED following his arrest yesterday.
— ANI (@ANI) March 22, 2024
(Video source: AAP) pic.twitter.com/A9YGNlxIGy
Comments
Please login to add a commentAdd a comment