ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి డుమ్మా కొట్టనున్నారా?.. అవుననే అంటున్నాయి అప్ వర్గాలు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు ఆయన గోవాకు వెళ్లనున్న నేపథ్యంలో ఈడీ సమన్లను మరోసారి దాటవేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
కేజ్రీవాల్‌కి గత వారం నాల్గవసారి ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 18న ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం గోవాకు వెళ్లాల్సి ఉన్నందున ఈడీ ముందు ఆయన హాజరుకావడానికి అవకాశం లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ జనవరి 11న గోవాకు వెళ్లాల్సి ఉండగా, గణతంత్ర దినోత్సవం కోసం ఢిల్లీలో సన్నాహాలను పర్యవేక్షించేందుకు వాయిదా వేశారని వెల్లడించాయి.
రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే సన్నాహాలను ఉటంకిస్తూ జనవరి 3న ఈడీ సమన్లను అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు. అంతకుముందు నవంబర్ 2, డిసెంబర్ 21న ఈడీ ముందు హాజరు కావాలని అధికారులు కోరారు. కానీ మూడుసార్లు ఈడీ సమన్లను దాటవేశారు. ఈడీ సమన్లను కేజ్రీవాల్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈడీ చర్యల వెనక రాజకీయ ప్రేరణ ఉందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. చట్టం ప్రకారమే ఈడీని ఎదుర్కొంటామని అన్నారు.
ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ
Comments
Please login to add a commentAdd a comment