సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదంతా డర్టీ పాలిటిక్స్ అంటూ కేంద్రంపై మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రజలు గట్టిగా స్పందిస్తారంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు ఇక్కడ ఏ జరంగుతుందో అంటూ విరుచుకుపడ్డారు. ఏదో ఒక రోజు ప్రజలు దీని గురించి కచ్చితంగా నిలదీస్తారన్నారు. ఈ అరెస్టులు మా పోరాటానికి మరింత బలం చేకూర్చి మమ్మల్ని మరింత స్ట్రాంగ్‌గా మారుస్తుందన్నారు.
ఈ అరెస్టులకు కారణం ఆప్‌కి పెరుగుతున్న ఆదరణనే అని చెప్పారు. ఇది కావాలని పెట్టిన తప్పుడు కేసు అన్నారు. ఆప్‌ని అంతం చేయాలనే బిజేపీ ఇలాంటి కుట్రలు చేస్తోందన్నారు. కాగా, సీబీఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను సుమారు ఎనిమిది గంటలు ప్రశ్నించి, తదనంతరం అనుహ్యంగా అరెస్టు ప్రకటించింది. పైగా విచారణలో సిసోడియా పొంతనలేని సమాధాలు ఇవ్వడంతోనే అరెస్టు చేసినట్లు పేర్కొంది.
(చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు.. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment