నాకు నోబెల్‌ ప్రైజ్‌ రావాలి!: సీఎం కేజ్రీవాల్‌ | Arvind Kejriwal says I should get Nobel prize for running govt Delhi | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు నాకు నోబెల్‌ ప్రైజ్‌ రావాలి!: సీఎం కేజ్రీవాల్‌

Published Sun, Feb 25 2024 5:00 PM | Last Updated on Sun, Feb 25 2024 5:26 PM

Arvind Kejriwal says I should get Nobel prize for running govt Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వానికి ఉ‍న్న విభేదాల నేపథ్యంలో తాను ఢిల్లీలో పరిపాలన కొనసాగిస్తున్నందుకు ‘నోబెల్‌ ప్రైజ్‌’ రావాలని అన్నారు. నీటి బిల్లులపై ఆప్‌ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడారు.

‘ఢిల్లీలో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించకుండా బీజేపీ అడ్డుపడుతోంది. వాళ్ల(బీజేపీ)పిల్లలు స్థాయిలో పేద పిల్లలు విద్య ద్వారా మంచి స్థానంలోకి ఇష్టం లేదు. నాకు తెలుసు.. నేను ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నానో. దానికి నాకు నోబుల్‌ ప్రైజ్‌ రావాలి’ అని సీఎం కేజ్రీవాల్‌ అన్నారు.

పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల విషయంలో ఆప్‌ ప్రభుత్వం వన్‌ టైం సెటిల్‌మెంట్‌ అమలను కేంద్రం ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు.. కేంద్ర ప్రభుత్వానికి భయపడి తమ ఆదేశాలను పట్టించుకోవటం లేదన్నారు.

‘ఢిల్లీ వాటర్‌ బోర్డు పథకానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ పథకానికి కేబినెట్‌ ఆమోదం పొందాలి. ఈ పథకాన్ని ఆపేయాలని బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరుతోంది. అధికారులు భయపడుతున్నారు. రాష్ట్ర మంత్రులు బిల్లు ఎందుకు తీసుకురావటం లేదని అడిగితే.. ఈ పథకాన్ని కేబినెట్‌ ఆమోదిస్తే మమ్మల్ని సస్పెండ్‌ చేస్తారని అధికారులు తెలిపారు. నకిలీ కేసుల బనాయించి తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు’ అని సీఎం కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు.

చదవండి: ‘బీజేపీకి ఒమర్‌ అబ్దుల్లా సవాల్‌.. ఎన్నికలు నిర్వహించండి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement