
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కుమారుడి వివాహ వేడుక ఫోటో
Navjot Singh Sidhu Not Attend CM Channi Son Marriage
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో నెలకొన్న అస్థిరత ముగిసప్పటికి.. నేతల మధ్య ఇంకా సఖ్యత కుదిరినట్లులేదు. తాజాగా జరిగిన ఓ సంఘటన చూస్తే ఇది నిజం అనిపిస్తుంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. నవ్‌జోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవికి అనుహ్యంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనేక సార్లు చర్చలు, డిమాండ్లకు అంగీకరించిన తర్వాత సిద్ధూ శాంతించాడు. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించాడు. అయితే సిద్ధూ, చన్నీల మధ్య దూరం అలానే ఉంది. ఇందుకు సాక్ష్యంగా నిలిచే సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.
(చదవండి: మరణావస్థలో కాంగ్రెస్!: సిద్ధూ)
ఆదివారం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కుమారుడు వివాహం జరిగింది. గురుద్వారాలో చాలా సాధారణంగా జరిగిన ఈ వేడుకకు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కానీ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ మాత్రం ఈ వివాహవేడకకు హాజరు కాలేదు. ప్రస్తుతం సిద్ధు వైషో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ కశ్మీర్ వెళ్లారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చన్నీ కుమారుడి వివాహవేడుకకు సిద్ధూ హాజరుకాకపోవడంతో.. ఈ ఇద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చన్నీ కుమార్ నవ్‌జిత్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ సిమ్రన్‌ధీర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు.
Darshan of the primordial mother during Navratras is synergising ... Washes away all the dirt from the soul !! Blessed to be at the lotus feet of Mata Vaishno Devi#JaiMataDevi pic.twitter.com/MP5VcDzy9F
— Navjot Singh Sidhu (@sherryontopp) October 10, 2021