మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శిస్తున్న ప్రియాంక, రాహుల్
లక్నో: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీ, తన సోదరి ప్రియాంక గాం«దీతో కలిసి లఖీమ్‌పూర్ ఖేరిలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ, ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేల్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, సూర్జేవాలేలతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లక్నో విమానాశ్రయానికి రాహుల్ చేరుకున్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శించడానికి యూపీ ప్రభుత్వం అనుమతినిచి్చనప్పటికీ పోలీసులు రాహుల్ సొంత వాహనంలో వెళ్లడానికి అంగీకరించలేదు. పోలీసు వాహనంలో వెళ్లాలని చెప్పారు. దీంతో లక్నో విమానాశ్రయంలో రాహుల్ ధర్నా చేశారు. ‘నాకు వాహనం ఏర్పాటు చేయడానికి మీరెవరు? నేను నా సొంత వాహనంలో వెళతాను’ అంటూ పోలీసులు, భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నా వాహనంలో వెళ్లడానికి అనుమతించేవరకు నేను ఇక్కడే కూర్చుంటాను. రైతుల్ని అణిచివేస్తున్నారు. వారిని దోచేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ఎవరి కోసం చేశారో అందరికీ తెలుసు’’ అని రాహుల్ అన్నారు. రాహుల్ ధర్నాతో దిగొచి్చన యూపీ పోలీసులు సొంత వాహనంలో వెళ్లడానికి అనుమతించారు. లక్నో నుంచి సీతాపూర్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న ప్రియాంక గాంధీని ఆయన కలుసుకున్నారు.
మూడు రోజులుగా నిర్బంధంలో ఉన్న ప్రియాంక గాం«దీని విడుదల చేస్తున్నట్టు అదనపు మెజిస్ట్రేట్ ప్రకటించారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంక కలిసి కాల్పుల్లో మరణించిన లవ్‌ప్రీత్ సింగ్, రమన్‌కాశ్యప్ కుటుంబాలను పరామర్శించారు. అనతంతరం మరో బాధితుడు నచార్ సింగ్ ఇంటికి బయలుదేరారు. రాహుల్, ప్రియాంక కన్నా ముందు ఆప్ పారీ్టకి చెందిన నేతల బృందం బాధిత కుటుంబాలను పరామర్శించారు. గురువారం అఖిలేశ్ యాదవ్, బీఎస్‌పీ నేత మిశ్రాలు బాధిత కుటుంబాల పరామర్శకు రానున్నారు.
అమిత్‌షాతో అజయ్ మిశ్రా భేటీ
రైతు మరణాలకు నైతిక బా«ధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో బుధవారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలుసుకున్నారు. రైతులపైకి వాహనాన్ని అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ నడిపాడని ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాకి మిశ్రా వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన సమయంలో తాను కానీ, తన కుమారుడు కానీ అక్కడ లేరని చెప్పుకొచ్చారు.
సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
నేడు సీజేఐ నేతృత్వంలో విచారణ
ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు కేసులిస్టును సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీ సభ్యులుగా ఉన్నారు. 8 మంది మరణానికి కారణమైన లఖీమ్‌పూర్ ఖేరీ హింసపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఒక పథకం ప్రకారం రైతులపై దాడులు
దేశంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని, నియంతృత్వమే రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులపై ఒక పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం లక్నోకు బయలుదేరే ముందు ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం లక్నోకి వచ్చినప్పటికీ లఖీమ్‌పూర్ ఖేరికి వెళ్లడానికి తీరిక దొరకలేదని అన్నారు. యూపీలో కొత్త తరహా రాజకీయాలు నెలకొన్నాయని, క్రిమినల్స్ తమ ఇష్టారాజ్యంగా దారుణాలకు తెగబడి యధేచ్ఛగా తిరుగుతున్నారని, బాధితులకి న్యాయం చెయ్యమని అడిగితే నిర్బంధిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment