
Punjab Advocate General Who Sidhu Wanted Out Resigns: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తన పంతం నెగ్గించుకున్నారు. సిద్ధూ డిమాండ్లకు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ తలొగ్గారు. ఎట్టకేలకు అడ్వకేట్ జనరల్ (ఏజీ) రాజీనామాను ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నియమించాలనే నిర్ణయాన్ని ప్రకటించడంతో పంజాబ్ కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన ముగిసినట్లు కనిపిస్తోంది.
ఈ విషయంపై చున్నీ మాట్లాడుతూ.. ఏజీ కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. ఇవాళ కేబినెట్ ఆమోదించింది. గవర్నర్ ఆమోదం కోసం పంపుతున్నాము. ఈరోజు ఆమోదం పొందితే రేపు కొత్త ఏజీని నియమిస్తామన్నారు. అంతేకాకుండా డీజీపీ పోస్టుకు చట్టప్రకారం 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారి ప్యానెల్‌కు పంపి.. కొత్త డీజీపీని కూడా నియమిస్తాం' అని తెలిపారు. కాగా, పంజాబ్ అడ్వకేట్ జనరల్ పదవికి ఏపీఎస్ డియోల్, డీజీపీగా ఇక్బాల్ ప్రీత్‌సింగ్ సహోటా రాజీనామా చేసే వరకు పీసీసీ బాధ్యతలు స్వీకరించబోనని సిద్ధూ మొండికేసిన సంగతి తెలిసిందే.