
చండీగఢ్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ బైకర్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహాయం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. చండీగఢ్‌లో ఓ ప్రాంతానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఓ వ్యక్తికి యాక్సిడెంట్ ఆయింధి. దీంతో అటుగా వెళ్తున్న సీఏం చన్నీ తన కాన్వాయ్‌ను ఆపి నడుచుకుంటూ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి అడిగి మరీ తెలుసుకున్నారు. అంబులెన్స్ పిలిపించి అతనికి సకాలంలో వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
జనవరి 5న ఎన్నికలు జరగనున్న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రత ఉల్లంఘనపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసింది. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ ఈ వ్యవహారంపై విచారించనున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాష్ట్రం, కేంద్రం వణికిపోతున్నాయి.
Seeing an Accident in Chandigarh today, CM Channi rushed to the injured man and helped him @CHARANJITCHANNI pic.twitter.com/OLkaxU41XE
— INC TV (@INC_Television) January 10, 2022
Comments
Please login to add a commentAdd a comment