న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ప్రచారంలో భాగంగా ఈరోజు(శనివారం) ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కారులో వెళుతున్న సమయంలో రాయి వేశాడో దుండగుడు. అయితే ఇది బీజేపీ పనే అని ఆప్ ఆరోపిస్తోంది.
‘బీజేపీ(BJP)కి భయం పట్టుకుంది. బీజేపీ బాగా భయాందోళనకు గురౌతోంది. దాంతోనే దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే అరవింద్ ేజ్రీవాల్ కారుపై దాడి చేశారు’ అని మాటల యుద్ధానికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
ఈ మేరకు వీడియోతో పాటు బీజేపీపై పలు ఆరోపణలు చేసింది ఆప్. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. అరవింద్ కేజ్రీవాల్ ను రాళ్లతో టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన ప్రచారం చేయలేకపోతున్నారు కాబట్టి రాళ్లతో దాడులకు దిగుతోంది. ఏం జరిగినా కేజ్రీవాల్‌వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. దీనికి ఢిల్లీ ప్రజలు మీకు గట్టిగానే బుద్ధి చెబుతారు’ అని ఆప్ ట్వీట్‌లో పేర్కొంది.
నల్లరంగు ఎస్‌యూవీలోకేజ్రీవాల్ వెళుతున్న సమయంలో, చుట్టూ సెక్యూరిటీ ఉండగా కొంతమంది నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా కేజ్రీవాల్ కారును అడ్డగించారు. ఆ సమయలో ఒక పెద్దరాయి కేజ్రీవాల్ కారుపై వచ్చి పడింది. దాంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. కేజ్రీవాల్ ను అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఆప్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
Arvind Kejriwal attacked with a stone in New Delhi VS by BJP Gundas😳
pic.twitter.com/VxHpJlz0L7— Gss🇮🇳 (@Gss_Views) January 18, 2025
కాగా గత రెండు పర్యాయాలుగా ఢిల్లీలోఆప్ అధికారాన్ని చేపట్టింది. 2013 నుంచి ఇప్పటివరకూ ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైనా ఢిల్లీ పగ్గాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆప్‌కు ధీటుగా ప్రచారాన్నిసాగిస్తూ బీజేపీ సైతం దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా వీరిద్దరి ప్రచారం నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment